మొదటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026లో పతకాలు సాధించిన పోలీస్ సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు -వివిధ విభాగాల్లో 42 పతకాలు సాధించిన ప్రకాశం జిల్లా పోలీసులు

రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుండి 4 వరకు జరిగిన 1వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026 పోటీల్లో గుంటూరు రేంజ్ తరఫున పాల్గొన్న ప్రకాశం జిల్లా పోలీస్ సిబ్బంది మొత్తం 42 పతకాలు సాధించిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ప్రత్యేకంగా అభినందించి, స్వీట్లు పంచిపెట్టారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

క్రీడా పోటీల్లో లాన్ టెన్నిస్ డబుల్స్ (NGOs), 100 మీటర్ల పరుగు (పురుషులు), 200 మీటర్ల పరుగు (పురుషులు), కబడ్డీ, వెయిట్ లిఫ్టింగ్, ఆర్మ్ రెజ్లింగ్, పెన్కాక్ సిలాట్, ఫెన్సింగ్, 4×100 మీటర్ల రిలే, వుషు, తైక్వాండో, కరాటే, పవర్ లిఫ్టింగ్, హ్యాండ్‌బాల్ తదితర పోటీలు మరియు కంప్యూటర్ అవేర్‌నెస్ విభాగంలో ప్రోగ్రామ్ ఎబిలిటీ, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ (PPT), ఆఫీస్ ఆటోమేషన్ వంటి పోటీలు జరిగినాయి.

ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, 1వ ఏపీ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్–2026లో ప్రకాశం జిల్లా పోలీస్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 42 పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. ఇందులో 13 బంగారు పతకాలు, 16 వెండి పతకాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయని తెలిపారు.ఒకవైపు పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూనే, మరోవైపు క్రీడల పట్ల ఆసక్తితో నిరంతరం సాధన చేస్తూ పోటీల్లో పతకాలు సాధించడం ఎంతో గొప్ప విషయమని ప్రశంసించారు. భవిష్యత్‌లో నిర్వహించే మరిన్ని క్రీడా పోటీల్లో ఇదే స్ఫూర్తితో రాణించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

వివిధ క్రీడా విభాగాల్లో పతకాలు సాధించిన విజేతలు

1)S. V. రమణారెడ్డి (RI) – లాన్ టెన్నిస్ డబుల్స్ (NGOs)లో వెండి పతకం సాధించారు.
2)V. సురేష్ బాబు (RSI 4196) – 100 మీటర్ల పరుగులో బంగారు, 200 మీటర్ల పరుగులో బంగారు, కబడ్డీలో వెండి పతకం సాధించారు.
3)CH. శివ సుబ్రహ్మణ్యం (SI 3367) – కంప్యూటర్ అవేర్‌నెస్ (Program Ability)లో వెండి, PPTలో కాంస్య, Office Automationలో కాంస్య పతకాలు సాధించారు.
4)P. రాజగోపాల్ (ASI 1816) – వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పతకం సాధించారు.
5)N. వరలక్ష్మి (WASI 101) – ఆర్మ్ రెజ్లింగ్, పెన్కాక్ సిలాట్ లో బంగారు పతకాలు; కబడ్డీలో వెండి, ఫెన్సింగ్, 4×100లో కాంస్య పతకాలు సాధించారు.
6)M. రాజశేఖర్ (HC 819) – వుషు, ఫెన్సింగ్ లో బంగారు పతకాలు; తైక్వాండో, పెన్కాక్ సిలాట్, కరాటే లో వెండి పతకాలు సాధించారు.
7) S. శ్రీనివాసులు (HC 1281) – పవర్ లిఫ్టింగ్‌లో వెండి, వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం సాధించారు.
8)D. రత్నం బాబు (PC 2609) – తైక్వాండో, పెన్కాక్ సిలాట్, వుషు లో బంగారు పతకాలు; కరాటే లో వెండి పతకం సాధించారు.
9)P. కరీముల్లా (PC 2823) – వుషు, పెన్కాక్ సిలాట్ లో బంగారు పతకాలు; తైక్వాండో, కరాటే లో వెండి పతకాలు, హ్యాండ్‌బాల్‌లో కాంస్య పతకం సాధించారు.
10)K. స్పర్జన్ రాజు (PC 923) – తైక్వాండో, పెన్కాక్ సిలాట్ లో వెండి పతకాలు; కరాటే లో కాంస్య పతకం సాధించారు.
11)M. శ్రీలక్ష్మి (WPC 126) – వెయిట్ లిఫ్టింగ్‌లో బంగారు, పవర్ లిఫ్టింగ్‌లో కాంస్య, కబడ్డీలో వెండి పతకం సాధించారు.
12)W. వెంకటేష్ (ARPC 2786) – కబడ్డీలో వెండి పతకం సాధించారు.
13)V. గిరిబాబు (ARPC 2796) – కబడ్డీలో వెండి పతకం సాధించారు.
14)J. కోటేశ్వరరావు (HC 682) – హ్యాండ్‌బాల్‌లో కాంస్య పతకం సాధించారు.
15)G. సుధాకర్ (HC 998) – హ్యాండ్‌బాల్‌లో కాంస్య పతకం సాధించారు.
16)SK. యస్దాని (ARPC 899) – హ్యాండ్‌బాల్‌లో కాంస్య పతకం సాధించారు.
17)P. వెంకటరావు (ARPC 3874) – హ్యాండ్‌బాల్‌లో కాంస్య పతకం సాధించారు.
18)K. శుభాన్ రెడ్డి (ARPC 3932) – హ్యాండ్‌బాల్‌లో కాంస్య పతకం సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *