స్మార్ట్ కార్డుల పంపిణీ పేదలకు ఎంతో ఉపయోగ కరం…. బేగంపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విశాల్ సుధామ్.

బేగంపేట సెప్టెంబర్ 8 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
స్మార్ట్ కార్డుల పంపిణీ పేదలకు ఎంతో ఉపయోగ కరం. అని బేగంపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విశాల్ సుధామ్ అన్నారు.మంగళ వారం ఎన్ బి టి నగర్,పాటి గడ్డ కమ్యూనిటీ హాలులో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బేగంపేట సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధామ్ పరిశీలించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ల ఆధ్వర్యంలో స్మార్ట్ కార్డ్ ల పంపిణీ పేదలకు ఎంతో ఉపయోగకరం అన్నారు.అర్హులైన పేదలందరికీ స్మార్ట్ కార్డుల ను అందేలా చూస్తామని విశాల్ అన్నారు. అధికారులు ఈ విషయంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు,కాంగ్రెస్ నాయకులు ప్యాటా సాయి. షాజా ,తస్లీమా జులేఖ,తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *