ఎస్ ఐ ఆర్ రెండవ దశ లో భాగంగా బేగంపేట డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నసీరుద్దీన్ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు.

బేగంపేట సెప్టెంబర్ 8(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఎస్ ఐ ఆర్ రెండవ దశ లో భాగంగా బేగంపేట డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నసీరుద్దీన్ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.మంగళవారమ పాటిగడ్డ మోడల్ మార్కెట్‌లోని హియరింగ్ సెంటర్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఇందులో బూత్ నంబర్ 27 నుండి 38 వరకు ఓటర్లు తమ నోటీసులను అవసరమైన పత్రాలతో సమర్పించారు. ఈ సందర్భంగా నసీరుద్దీన్ మాట్లాడుతూ తమ నాయకురాలు సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డా .కోట నీలిమ,బేగంపేట డివిజన్ సీనియర్ నాయకులు విశాల్ సుధామ్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో ప్రజలకు అవసరమైన సేవలను అందించేందుకు తాను ఎల్లపుడూ సిద్ధంగా ఉంటానన్నారు.తమ నేతల ఆదేశం మేరకు నడుచుకుంటూ వారి సలహాలు ,సూచనలతో డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కి వైభవం తీసుకు వస్తామని ,కార్యకర్తలతో కలిసి ముందుకు నడుస్తానని నసీరుద్దీన్ తెలియ జేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *