హైదరాబాద్, సెప్టెంబర్ 8,( జే ఎస్ డి ఎం న్యూస్)
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోగుల నడక, శారీరక కదలికలు, గుండె–ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కచ్చితంగా అంచనా వేసి మెరుగైన పునరావాస చికిత్స అందించేందుకు ఫిజియోథెరపిస్టులు మరింతగా సాంకేతిక పరిజ్ఞానాన్నిఅందిపుచ్చుకోవాలని కిమ్స్ ఆసుపత్రుల రిహాబిలిటేషన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ సుధీంద్ర వూటూరి అన్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్నిపురస్కరించుకుని కిమ్స్ ఆసుపత్రులు సికింద్రాబాద్‌లోని రిహాబిలిటేషన్ విభాగం, ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ సంయుక్తంగా ‘స్ట్రైడ్ అండ్ స్టామినా: గైట్ అనాలసిస్ అండ్ ఏరోబిక్ టెస్టింగ్ ఇన్ ఫిజియోథెరపీ’ పేరిట ఒకరోజు జాతీయస్థాయి వర్క్‌షాప్‌నునిర్వహించాయిఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి 100 మందికి పైగా
ఫిజియోథెరపిస్టులు, రిహాబిలిటేషన్ నిపుణులు హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ సుధీంద్ర వూటూరి మాట్లాడుతూ ఆధునిక పునరావాస వైద్యంలో రోగి కదలికలను కేవలం పరిశీలించడం కాకుండా, సాంకేతిక పరికరాల ద్వారా శాస్త్రీయంగా విశ్లేషించడం ఎంతో కీలకమన్నారు. నడకలో ఉన్న చిన్నపాటి మార్పులను సైతం గుర్తించి, వాటికి అనుగుణంగా వ్యక్తిగత చికిత్సా విధానాన్ని రూపొందించేందుకు అధునాతన గైట్ అనాలసిస్,కార్డియోపల్మనరీ ఫంక్షనల్ టెస్టింగ్ ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు.రెండు విభాగాల్లో శిక్షణ
వర్క్‌షాప్‌లో భాగంగా ఉదయం సెషన్‌లో రోగుల ఏరోబిక్ సామర్థ్యాన్ని అంచనా వేసే అధునాతన పద్ధతులపై నిపుణులు అవగాహన కల్పించారు. మధ్యాహ్నం సెషన్‌లో ఆధునిక బయోమెకానిక్స్, గైట్ ల్యాబ్ ద్వారా నడకలోని మార్పులను శాస్త్రీయంగా విశ్లేషించే విధానాలను ప్రదర్శించారు. స్ట్రోక్, పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న రోగుల్లో కనిపించే సంక్లిష్టమైన నడక సమస్యలను ప్రత్యక్షంగా విశ్లేషిస్తూ లైవ్ క్లినికల్ డెమాన్‌స్ట్రేషన్లు నిర్వహించారు. 2డీ మార్కర్‌లెస్ వీడియో ట్రాకింగ్, 3డీ కైనమాటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి రోగుల కదలికలను ఎలా విశ్లేషించవచ్చో నిపుణులకు వివరించారు.కేవలం పరిశీలన కాకుండా.. శాస్త్రీయ ఆధారాలతో చికిత్స
ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ యూనిట్ హెడ్ డాక్టర్ సునీల్ రెడ్డి (పీటీ) మాట్లాడుతూ రోగుల కదలికలకు సంబంధించి ఆబ్జెక్టివ్ బయోఫీడ్‌బ్యాక్ రిపోర్టింగ్ వ్యవస్థలను ఉపయోగించడం వల్ల చికిత్సలో మరింత కచ్చితత్వం సాధించవచ్చన్నారు. ఫిజియోథెరపిస్ట్ సాధారణంగా చేసే పరిశీలనకు అదనంగా శాస్త్రీయ డేటాను ఉపయోగించడం ద్వారా ప్రతి రోగికి అవసరమైన పునరావాస ప్రణాళికను మరింత సమర్థంగా రూపొందించవచ్చని తెలిపారు. తద్వారా రోగుల నడక, కదలికలు, శారీరక సామర్థ్యం మెరుగుపడేలా లక్ష్యిత చికిత్స అందించవచ్చన్నారు.
సాంకేతికతతో పాటు మానవీయత అవసరం
కార్యక్రమంలో కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి. భాస్కర్‌రావు మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్నిమానవీయతతో కలిపి ఉపయోగించినప్పుడే పునరావాస వైద్యం మరింత సమగ్రంగామారుతుందన్నారు. నాడీ సంబంధిత, ఎముకలు–కీళ్ల, గుండె సంబంధిత సంక్లిష్ట సమస్యలతోబాధపడుతున్న రోగులకు మెరుగైన చికిత్స అందించడంలోఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతనుఅందిపుచ్చుకుంటూనే రోగి అవసరాలను కేంద్రంగా చేసుకుని చికిత్స అందించాలని నిపుణులకు సూచించారు.

