హైదరాబాద్ సెప్టెంబర్ 8,(జే ఎస్ డి ఎం న్యూస్) : మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజా భవన్ లో మంగళవారం నిర్వహించిన 253వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 194 దరఖాస్తులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు 44, బీసీ సంక్షేమ శాఖకు 49, హోం శాఖకు 24, ఇతర శాఖలకు 77 దరఖాస్తులు అందాయి. సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసిపి ఉమేందర్ దరఖాస్తులు స్వీకరించి ఎండార్స్మెంట్ చేసి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఎన్.ఆర్.ఐ. సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీం రెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
