రైతులు ఎఫ్ సీ వీ పొగాకు సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పొగాకు పంటల సాగు వైపు మొగ్గు చూపాలని ఒంగోలు -2 వేలం నిర్వాహణాధికారి జె తులసి కోరారు. పొగాకు బోర్డు పరిధిలోని పోతవరం గ్రామంలో మంగళవారం పొగాకు సాగు రైతులతో సమావేశం నిర్వహించారు. పొగాకు సాగు వలన రైతులు ఎదుర్కోంటున్న ఇబ్బందులను వివరించారు. బ్యారన్క కేవలం ఒక హెక్టారులో 2వేల కేజీలకు మాత్రమే అనుమతి ఉందని చెప్పారు. రైతులు వేరుశనగ, మొక్కజొన్న, మిరప, కంది, శనగ పంటల ప్రత్యామ్నాయపంటలుగా సాగు చేసుకోవాలని కోరారు. భూసారాన్ని కాపాడటానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
