మొక్క జొన్న కు తగిన మోతాదులో నీరు అందించాలి.

పొట్ట దశలో ఉన్న మొక్కజొన్న పంటకు ప్రతి మూడు రోజులకు ఒక సారి తగిన మోతాదులో నీరు అందించాలని దర్శి టెక్నికల్ అధికారి టి వెంకటేశ్వర్లు చెప్పారు. తాళ్లూరు-2, కొర్రపాటి వారి పాలెంలలో మంగళవారం పొలం పిలుస్తుంది నిర్వహించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మొక్కజొన్న సక్రమంగా విత్తు పట్టటం లేదని వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కండె పట్టు దశలో ప్రతి నాలుగు లేదా ఐదు రోజులకు 5 మి.మీల నీటిని అందించాల్సి ఉంటుందని వ్యవసాయాధికారి ప్రసాద రావు వివరించారు. వాతావరణ ప్రతికూలత వలన గింజ సక్రమంగా పట్టనట్లు గుర్తించినట్లు వ్యవసాయాధికారి చెప్పారు. ఎఈఓ కె సుబ్బా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *