బేగంపేట సెప్టెంబర్ 9,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్యపై బేగంపేట పోలీస్ స్టేషన్లో బి ఆర్ ఎస్ నేతలు బుధవారం ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చేలా ఆయన మాట్లాడటంపై స్థానిక నేతలు తీవ్ర ఆగ్రహం
వ్యక్తం చేస్తూ బేగంపేట
సీఐ పి.సైదులు కి లిఖితపూర్వకంగా
ఫిర్యాదు అందజేశారు.
ప్రజాప్రతినిధులుగా ఉన్నవారుబాధ్యతాయుతంగా మాట్లాడాలని, ప్రజాక్షేత్రంలోహుందాతనాన్ని కాపాడాలని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. సమాజంలో గౌరవం పొందే వ్యక్తులపై ఇలాంటి అసత్య ప్రచారాలు, పరువు నష్టం కలిగించే అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సరికాదని, ఇలాంటి పోకడలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. సంబంధిత ఎమ్మెల్యేపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీహరి, రఘునాథ్, నరేష్ ,జాండ్ల కృష్ణ, మాజీ డివిజన్ అధ్యక్షుడు టి.రాజయ్య, పేపర్ శ్రీనివాస్, నారాయణ, బంగారు శ్రీను, కరీం పాషాతో పాటు బేగంపేట డివిజన్ నాయకుడు జతదితరులు పాల్గొన్నారు.

