బేగంపేట సెప్టెంబర్ 9
,(జే ఎస్ డి ఎం న్యూస్) :
అది ప్రతి నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రోడ్డు. అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రోడ్డు దాటాలంటే ప్రాణాలను పణంగా పెట్టడమే అవుతుంది.ఇది గుర్తించిన అధికారులు ఎట్టకేలకు బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మరోవైపు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మధ్యలో రోడ్డుకు అటు ఇటు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఫుట్ ఓవర్ (పాదచారుల వంతెన )బ్రిడ్జి ను నిర్మించారు.మొదట్లో ఆర్భాటంగా ఈ బ్రిడ్జి కి రెండు వైపుల లిఫ్ట్ లు ఏర్పాటు చేశారు.అవి కొద్ది కాలం పని చేసాయి.అయితే ఈ మధ్య కాలంలో లిఫ్ట్ లు పనిచేయడం లేదు.దీంతో చిన్నారులను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో,విద్యార్థినులను మహిళా కళాశాలలో వదిలి పెట్టేందుకు వచ్చిన వారి తల్లి దండ్రులు మెట్లు ఎక్కి ఒక వైపు నుంచి మరో వైపుకి చేరుకోవాల్సిన పరిస్థితి లు నెలకొన్నాయి.దీంతో వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు.ఇప్పటి కైనా సంబంధిత శాఖ అధికారులు ఫుట్ ఓవర్ బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న లిఫ్ట్లు పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలని స్థానికులు , విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
