అధికారులు అప్రమత్తంగా ఉండాలి – ఎస్పీడీసీఎల్ మెట్రోజోన్ సీఈ కరుణాకర్ బాబు.

బేగంపేట సెప్టెంబర్ 9,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
గణపతి నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగాఉండాలనీ,ఎస్పీడీసీఎల్ మెట్రో జోన్ సీఈ కరుణా కార్ బాబు సూచించారు. బుధవారం ఆయన ప్యారడైజ్ డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు అందించారు. మంటపాలు ఏర్పాటు చేసే ముందు నుంచి నిమజ్జనం వరకు వాటిని పరిశీలిస్తూ ఎక్కడ విద్యుత్ ప్రమాదాలు చోటు చేసికోకుండానిర్వాహకులకు సూచనలు ఇవ్వాలని తెలిపారు. భద్రతకు ప్రాధాన్యతనిస్తూ విద్యుత్ కనెక్షన్లను, వైరింగ్ ను పరిశీలించి ముందస్తుగా ప్రమాదాలు జరుగకుండా నివారించాలన్నారు. కనెక్షన్ ఇచ్చే ముందు మంటపంలో వైరింగ్, విద్యుత్ వైర్లు కిందకు వ్రేలాడుతూ ఉంటే సరిచేయాలన్నారు. ప్రతి మంటపంలో డ్యూటీ చార్ట్ ఉంచాలని, సిబ్బంది, అధికారులు రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నిమజ్జనం రోజు కూడా పోలీసులతో పాటు విద్యుత్ అధికారులు ఉంటూ ఎక్కడ విద్యుత్ ప్రమాదాలు చోటు చేసికోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రధానంగా నిమజ్జనం జరిగే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అన్నారు. ఎక్కడ బ్రేక్ డౌన్లు, విద్యుత్ అంతరాయాలు లేకుండా అధనపు ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రంలో సికింద్రాబాద్ ఎస్ఈ వేణుగోపాల్, ఇంచార్జ్ డీఈ రమణారావు, సీబీడీ డీఈ రమణయ్య, ఏడీఈ శివదుర్గా ప్రసాద్, ఏఈ శివ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *