బేగంపేట సెప్టెంబర్ 9,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రకాశం నగర్ లో చైనా టౌన్ బిర్యానీ హౌస్ ను బుధవారం సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డా.కోట నీలిమ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
నాణ్యమైన ఆహారాన్ని అందించి కస్టమర్ల నమ్మకాన్ని చూరగొనలనీ సూచించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమాని ఎం. కృష్ణను ఆమె అభినందించారు.
కృష్ణ మాట్లాడుతూ ఇది తాను ప్రారంభించిన మూడవ రెస్టారెంట్ అన్నారు.క్వాలిటీలో ఎక్కడా తాము రాజీ పడబోమని అన్నారు.నాణ్యమైన ఆహార పదార్థాలను కస్టమర్లకు అందిస్తామని,వారి అభిమానాన్ని చూరగొంటామని అన్నారు. కోటా నీలిమ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధాం కృష్ణకు అభినందనలు తెలియ జేశారు.నూతన వ్యాపారం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


