బేగంపేట సెప్టెంబర్ 11,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో శుక్రవారం నిర్వహించిన 254వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 101 దరఖాస్తులు అందాయి.వాటిలో రెవెన్యూ శాఖకు 24, బీసీ సంక్షేమ శాఖకు 13, మున్సిపల్ శాఖకు 16, ఇతర శాఖలకు 48 దరఖాస్తులు అందాయి. సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్ పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి దరఖాస్తులు స్వీకరించి ఎండార్స్మెంట్ చేసి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలనుపరిష్కరించారుఈ కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసిపి ఉమేందర్, ఎన్.ఆర్.ఐ. సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీ.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను పంపిణీ చేసిన గద్వాల్ విజయలక్ష్మి .
అనారోగ్య సమస్యలతో వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్ పర్సన్, సీఎం ప్రజావాణి ఇంచార్జ్ గద్వాల్ విజయలక్ష్మి శుక్రవారం ప్రజా భవన్ లో చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ పాల్గొన్నారు.
