రాబోవు మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి అని దర్శి MLA ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు.శుక్రవారం దర్శి పార్టీ ఆఫీస్ లో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జసరిగినది. ఈ సందర్బంగా బూచేపల్లి మాట్లాడుతూ రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం పై ప్రజలు విసిగి చెంది వున్నారాని ఎన్నికలు ఎప్పుడు జరిగిన మళ్ళీ వైస్సార్సీపీ అధికారం లోకి రావడం ఖాయం అని అన్నారు. ముఖ్యంగా ఇంతవరకు రైతులు, యువత, మహిళలు, విద్యార్థుల కు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది అని అన్నారు, నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్ మెంట్, 50 సంవత్సరాలు నిండిన SC, ST, BC మహిళలకు పెన్షన్, 18 సంవత్సరాలు నిండిన ఆడ బిడ్డలకు నెలకు రూ . 1500 ఇవ్వకుండా మోసం చేశారు అని అన్నారు. ఈ ప్రభుత్వంలో కనీసం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా ఈ ప్రభుత్వంలో లేదు అన్నారు. కూటమి ప్రభుత్వం పై అన్ని వర్గాలలో అసంతృప్తి వుంది అని అన్నారు. కావున రాబోయే అన్ని స్థానిక ఎన్నికల్లో వైస్సార్సీపీ పోటీ చేస్తుంది అని దానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా పరిషత్ ఛైర్మెన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి నియోజకవర్గ పరిశీలకులు మాజీ పీడీసీసీ బ్యాంక్ ఛైర్మెన్ మాదాసి వెంకయ్య, రాష్ట్ర, జిల్లా, మండల పార్టీ నాయకులు, ఎంపీపీ లు, జడ్పీటీసీ లు పాల్గొన్నారు .




