గణేష్ సురక్ష సంకల్ప 2026.గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి….బేగంపేట ఏ సి పి.గోపాల కృష్ణ మూర్తి.

బేగంపేట సెప్టెంబర్ 16,(జే ఎస్ డి ఎం న్యూస్) :
గణేష్ నవరాత్రి ఉత్సవాల ఉత్సాహాన్ని సద్వినియోగం చేసుకుంటూ యువత, కుటుంబాలు మరియు సమాజంలో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై చైతన్యం తీసుకురావడం, తద్వారా సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు ఉజ్వలమైన మల్కాజ్‌గిరిని నిర్మించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని బేగంపేట ఏ సి పి గోపాల కృష్ణ మూర్తి అన్నారు.
గణేష్ సురక్ష సంకల్ప 2026 లో భాగంగా బేగంపేట పరిధిలో మయూరి మార్గ్ , శ్యామ్ లాల్ లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఏ సి పి మాటాడుతూ గణేష్ మండపాల దగ్గర మాదకద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని పోలిస్ స్టేషన్ల నివసించే ప్రజల
ఉజ్వల భవిష్యత్తు కోసం భక్తి – డ్రగ్స్ రహిత పండుగ వేడుకలకు సామాజిక బాధ్యతను జోడిస్తూ, మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గణేష్ మండపాలలో “సే నో టు డ్రగ్స్ (డ్రగ్స్‌కు నో చెప్పండి)” అనే బలమైన సందేశంతో “గణేష్ సురక్ష సంకల్పం 2026 పేరిట విస్తృత స్థాయి మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల ఉత్సాహాన్ని సద్వినియోగం చేసుకుంటూ యువత, కుటుంబాలు మరియు సమాజంలో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై చైతన్యం తీసుకురావడం, తద్వారా సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు ఉజ్వలమైన మల్కాజ్‌గిరిని నిర్మించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.అన్నారు.
కమిషనరేట్ పరిధిలోని మొత్తం 29 పోలీస్ స్టేషన్లలో, ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చొప్పున గణేష్ మండపాలు ఎంచుకొని కమిషనరేట్ వ్యాప్తంగా మొత్తం 58 అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్నారు. అలాగే మాదకద్రవ్యాల దుర్వినియోగంపై వినూత్న, సృజనాత్మక అవగాహన ఏర్పాటు చేసి మొత్తం 58 కార్యక్రమాలలో అత్యుత్తమ నిర్వహణ మరియు విశేష ప్రజా ప్రభావాన్ని చూపిన ఉత్తమ 2 మండపాలకు మరియు ఉత్సాహంగా పాల్గొన్న వ్యక్తులను ఎంపిక చేసి అవార్డులు అందజేయడం జరుగుతుందన్నారు.
ఉత్సవ నిర్వాహకులు, యువత, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు మరియు పౌరులందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, “గణేష్ సురక్ష సంకల్పం – 2026”ని డ్రగ్స్ రహిత, సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన మల్కాజ్‌గిరి నిర్మాణం కోసం ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ మరియు కమిషనర్ సుమతి , డి సి పి శ్రీధర్ నిర్ణయించారన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ సి పి బేగంపేట గోపాలకృష్ణ మూర్తి, ఈగల్ ఫోర్స్ డి ఎస్ పి పుష్పన్ కుమార్, సి ఐ సైదులు ,డి ఐ శ్రీనివాస్, ఎస్సైలు శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ లతో పాటు గణేష్ నిర్వాహక కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో సహచరి సభ్యులు ( స్వయం సహాయక సంఘాల సభ్యులు) పాల్గొని విజయవంతం చేశారు. అలాగే మహిళా భద్రత, రోడ్డు భద్రత, సైబర్ నేరాల నియంత్రణకు చర్యలతో పాటు ఆహార భద్రతకు సంబంధించిన అంశాల 9 రోజులు, రోజు రెండు మండపాల వద్ద ఈ కార్యక్రమాలు జరుగుతాయి.
మీ భద్రత- మా భాద్యత.అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *