ఒంగోలు : రైతులు పొగాకు సాగు ఖర్చు తగ్గుంచుకుని నాణ్యమైన పొగాకును పండించాలనిఒంగోలు – 2 పొగాకు బోర్డు ఎసీ జె తులసి కోరారు. ఒంగోలు-2 పరధిలోని అనుబ్రోలు వారి పాలెం, ప్రాసంగుల పాడు గ్రామాలలో ఎఫ్సీవీ పొగాకు నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. బోర్డు ఇచ్చిన పరిమాణం మేరకే పంట సాగు చెయ్యాలని కోరారు. ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించి లాభదాయక వ్యవసాయం చెయ్యాలని కోరారు.
