ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం…..ఎమ్మెల్యే తలసాని.

సనత్ నగర్ సెప్టెంబర్ 16,(జే ఎస్ డి ఎం న్యూస్)
ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను నిరంతరం కృషి చేస్తానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం అమీర్ పేట డివిజన్ లోని DK రోడ్డులో గల ఆశ్రయ్ కాలనీలో ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 2014 లో తాను ఎమ్మెల్యే గా ఎన్నికైన తర్వాతే సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఎవరు ఊహించని స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ పైప్ లైన్ పనుల అభివృద్ధి, నూతన లైన్ ల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు కోట్లాది రూపాయల వ్యయంతో చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలను కూడా తాను వచ్చిన తర్వాత పరిష్కారం అయ్యాయని వివరించారు. తాను నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అభివృద్ధి లో సనత్ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ కార్యకలాపాలతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఈ విషయమై పరిశీలన చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, టౌన్ ప్లానింగ్ ACP రమేష్, GHMC AE జమీర్, వాటర్ వర్క్స్ AE మౌనిక, ఎలెక్ట్రికల్ AE మౌనిక, శానిటేషన్ DE వెంకటేష్, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు ప్రవీణ్ రెడ్డి, నామన సంతోష్ కుమార్, సురేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రదీప్ గౌడ్, కూతురు నర్సింహ, కట్టా బలరాం, గుడిగే శ్రీనివాస్ యాదవ్, సుమిత్ సింగ్, గోపిలాల్ చౌహన్, గులాబ్ సింగ్, ఉత్తమ్ సింగ్, హరిసింగ్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *