ఈవీఎం గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు శుక్రవారం స్థానిక మామిడిపాలెంలోని ఈవీఎం గోదాములను పరిశీలించారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాముల తలుపులు తెరిచి, వాటిలో భద్రపరిచిన ఈవీఎంలను పరిశీలించారు. వాటి స్థితిగతులను, భద్రపరిచిన తీరు, ఈ ప్రాంగణంలో కల్పించిన పోలీస్ సెక్యూరిటీపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట డిఆర్ఓ పీవీ రమణ, టిడిపి ప్రతినిధి కె.అంకరాజు, బిజెపి ప్రతినిధి ఆర్. అజయ్ కుమార్, వైయస్సార్ సిపి ప్రతినిధి పి.రాజీవ్, కాంగ్రెస్ ప్రతినిధి రసూల్, బీఎస్పీ ప్రతినిధి ఎన్.రవికుమార్, జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *