జనసేనలో చేరిన జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, బెల్లంకొండవారిపాలెం మాజీ సర్పంచ్ పోశం సుమలత శ్రీకాంత్ రెడ్డి లు ఒంగోలు ఎంపీ మాగుంట కార్యాలయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. కూటమి విజయానికి కృషి చేయాలని ఎంపీ మాగుంట వారికి సూచించారు. ఎంపీమాగుంటను దుశ్శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నేతలు జి.వేణుబాబు, కె.నరసింహారావు, కె.రామయ్య, ప్రభాకర్ రెడ్డి , సుధాకర్ తదితరులు పాల్గొన్నారు .
