పచ్చదనం పెంపొందించటమే లక్ష్యం- ప్రకృతి వ్యవసాయానికి చేయూత -జిల్లాలో పలు చోట్ల ప్రకృతి వ్యవసాయం పరిశీలన

ప్రకాశం జిల్లాలో పచ్చదనం పెంపొందిచటమే లక్ష్యంగాప్రభుత్వం వ్యవసాయశాఖ కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ రాజా బాబు అన్నారు. తాళ్లూరు మండలంలోని శివరామపురం వద్ద సాగు చేస్తున్న ప్రకృతి వ్వవసాయాన్ని, కావ్య అగ్రికల్చర్ సొల్యూషన్స్, సోలార్ డ్రయ్యర్, కృషి కేర్ అండ్ హోమ్ కేర్ సెంటర్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకృతి వ్యవసాయం పట్ల ప్రత్యేక శ్రర్థ తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రకృతి వ్యవసాయ ప్రొత్సహకానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 2.5 ఎకరాలలలో రూ. 29 లక్షల పెట్టుబడితో వైవిద్యమైన పంటలను సాగు చేస్తున్నారని చెప్పారు. వరి పంటలో కలుపు రాకుండా నివారించటం, నూకలు చల్లుట ద్వారా సేంద్రీయ ఎరువుల వాడటం ద్వారా పంట పుష్కలంగా ఉండటాన్ని గమనించినట్లు చెప్పారు. ఎల్ నిలో ప్రభావంతో బీడు భూములలో సాగు చేయటానికి వీలులేని పొలాలను పచ్చదనం పెంపొందించటమే లక్ష్యమని తెలిపారు. పరిశీలించిన అంశాలను జిల్లా స్ధాయిలో అమలు చేయటానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా మద్దిపాడు, చీమకుర్తి మండలాలలోని ప్రకృతి వ్యవసాయం, చెన్నుపాటి సాంబశివరావుకు సంబంధించిన పాల ఉత్పిత్తి కేంద్రాన్ని పరిశీలించారు. రూ. 40 లక్ష్యల వ్యయంతో రోజుకు 150 లీటర్ల పాల ఉత్పత్తిని సాధిస్తున్నట్లు కలెక్టర్కు యజమాని వివరించారు. చెన్నుపాటి రామాంజనేయులు 2.5 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఒక్క ప్రధాన పంట కాగా, అరటి, మునగ, వివిధ రకాల పండ్లు సాగు చేసే విధానాన్ని పరిశీలించారు. నేకునంబాదు, ఇల పావులూరులో వరి సాగు చేయు విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, పశుసంవర్థశాఖ అధికారి వెంకట రెడ్డి, ప్రకృతి వ్యవసాయ జిల్లా మెనేజరుభాషిని, జిల్లా ఉద్యాన వనశాఖాధికారి గోపీచంద్, కావ్య అగ్రికల్చర్సోల్యూషన్స్ చైర్మన్ గిరిధర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *