హైదరాబాద్ సెప్టెంబర్ 18(జే ఎస్ డి ఎం న్యూస్) :
తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలతో పాటు శారీరక, మానసిక ఎదుగుదలలో ఇబ్బందులుఎదుర్కొంటున్న తొమ్మిదేళ్ల చిన్నారి స్టెల్లాకు సీఎం ప్రజావాణి అండగా నిలిచింది.చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న సీఎం ప్రజావాణి రాష్ట్ర స్థాయి ఇన్చార్జ్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి, స్టెల్లాకు అవసరమైన మందులు నిరంతరం అందేలా చర్యలు తీసుకున్నారు.స్టెల్లా చికిత్సకు ప్రతి నెల సుమారు రూ.10 వేల విలువైన మందులుఅవసరమవుతున్న నేపథ్యంలో, అవి నెలనెలా అందేలా ఏర్పాట్లు చేసి, శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే
ప్రజాభవన్‌లో స్టెల్లా తల్లి కవితకు మెడిసిన్ కిట్‌ను అందజేశారు.జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివసిస్తున్న కవిత ఒంటరిగా తన కుమార్తెనుచూసుకుంటున్నారు. వైద్య ఖర్చులు భారంగా మారడంతో ఇటీవల సీఎం ప్రజావాణిని ఆశ్రయించి తన పరిస్థితిని గద్వాల్ విజయలక్ష్మి దృష్టికి తీసుకువచ్చారు.వినతిపై వెంటనే స్పందించిన గద్వాల్ విజయలక్ష్మి, చిన్నారికి అవసరమైన మందులు మధ్యలో ఆగకుండా అందేలా చర్యలు చేపట్టారు.
ప్రజావాణికి వచ్చే ప్రతి వినతి వెనుక ఒక కుటుంబం, ఒక బాధ, ఒక ఆశ ఉంటుంది. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో వెంటనే స్పందించడం మన బాధ్యత” అని గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
సహాయం అందడంతో స్టెల్లా తల్లి కవిత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కి, గద్వాల్ విజయలక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు.
