బేగంపేట సెప్టెంబర్ 18,(జే ఎస్ డి ఎం న్యూస్) :
గణేష్ చతుర్థి నవరాత్రుల సందర్భంగా శుక్రవారం ప్రకాష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్గా కరుణాకర్ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్యామ్ లాల్ బిల్డింగ్
ఎరుకల బస్తీ చౌరస్తాలో
శివ భక్త భజన మండలి అధ్యక్షులు
కె సురేష్ ఆధ్వర్యంలో
ఏర్పాటు చేసిన
వినాయక మండపాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.
వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో
ఉండాలని దర్గా కరుణాకర్ ఆకాంక్షించారు.పూజా కార్యక్రమంలో
శివ భక్త భజన మండలి అధ్యక్షుడు కే సురేష్,
కొండ కిరణ్, చిన్న,శ్యామ్,
నాగ రాజు, మహేష్, కిషోర్, భరత్, దీపికా తదితరులు పాల్గొన్నారు.
