బేగంపేట సెప్టెంబర్ 19,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
స్మార్ట్ రేషన్ కార్డులతో
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని
ప్రకాష్ నగర్ డివిజన్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్గా కరుణా కర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశం పెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని
ప్రకాష్ నగర్ లోని
905 రేషన్
షాప్ లో
డివిజన్ అధ్యక్షులు
దర్గా కరుణాకర్
రేషన్ కార్డ్
లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు,
ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు,స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు రేషన్ తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రయోజనాలు మరింత పారదర్శకంగా సులభంగా అందే అవకాశం ఉంటుందన్నారు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు,
స్మార్ట్ రేషన్ కార్డ్ ల పంపిణీ కార్యక్రమంలో డివిజన్ మైనారిటీ అధ్యక్షులు పర్వేజ్, కాంగ్రెస్ యువ నాయకులు రాఘవ, ఇర్షాద్, తదితరులు పాల్గొన్నారు.

