తాళ్లూరు : మండలంలో పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహాలను అధి సంఖ్యలో ఆదివారం నిమర్జనాలను తరలించారు. వినాయక చవితి నుండి ఐదు రోజుల పాటు పూజలు అందుకున్న స్వామిని గ్రామోత్సవాలతో యువకులు, గణేష్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా తరలించారు. తాళ్లూరు, దోసకాయలపాడు, బెల్లంకొండ వారి పాలెం, రాజానగరం, శివరామపురంలకు చెందిన 9 విగ్రహాలు మేళ తాళాలతో గులాంలు చల్లుకుంటూ, కోలాటం ప్రదర్శిస్తూ భక్తులు నిమర్జనానికి తరలించారు. ఎస్సై మల్లిఖార్జున రావు తన సిబ్బందితో ఆయా గ్రామాలలో శాంతి భద్రతలు పర్యవేక్షించారు.


