ప్రకాశం / ఒంగోలు, సెప్టెంబర్ 21 :
ఒంగోలు భాగ్యనగర్ లోని బదిరుల ప్రభుత్వ పాఠశాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, వయోవృద్ధులు మరియు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం పాఠశాల పరిసరాలు, ఆట స్థలం మంత్రి పరిశీలించారు. విభిన్న ప్రతిభావంతుల విద్యార్థుల విద్య, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆకాంక్షించారు.

