నాగులుప్పలపాడు : ఈ నెల 27 న ఒంగోలు ఇండియన్ మెడికల్ హాల్ లో పైడి శ్రీ 13 వ స్మారక సభ నిర్వహిస్తున్నామని మాల సభ కన్వీనర్ మేడికొండ మురళి తెలిపారు.
శుక్రవారం ఉప్పుగుండురు లోనీ అంబేద్కర్, జగజీవన్ రావు విగ్రహాల వద్ద పైడి శ్రీ స్మారక సభ కరపత్రాలను దళితనేత నీలం నాగేంద్ర విడుదల చేసారు.ఈ సందర్బంగా దార అంజయ్య,మేడికొండ మురళి సంయుక్తంగా మాట్లాడుతూ ఒంగోలు గద్దలగుంట కు చెందిన పైడి తేరేష్ బాబు చిన్నప్పటి నుండిగొప్ప కళాకారుడన్నారు. తాను చదివిన సి య స్ ర్ శర్మ కాలేజీ లో స్వయంగా నాటికలు రాసి నటుడుగానే గాక దర్శకత్వం వహించేవాడన్నారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ మరియు సినీ రచయిత మరుదురి రాజా పైడి శ్రీ సహ విద్యార్థులన్నారు.పైడి తేరేష్ బాబు ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాతగా సెలెక్ట్ అయ్యి మొదట రామగుండం లో పని చేసారన్నారు. తరువాత హైదరాబాద్ కు బదిలీ పై వెళ్లి ఉర్దూ సాహిత్యం తో సహవాసం చేసి తెలుగు గజల్ మొగల్ సి.నారాయణ రెడ్డి స్ఫూర్తి తో తెలుగు గజల్ లో రచించడన్నారు . దళిత ఉద్యమ ప్రభావం తో మనువాద సాహిత్యనికి అభ్యుదయ సాహిత్యానికి వ్యతిరేకంగా దళితుల వాడుక భాషతో అక్రకుల సాహిత్య దిక్కార రచనలు చేసాడన్నారు.
ఈ టీవీ లో ప్రసారమైన “విధి ”సీరియల్ రచయిత పైడి శ్రీ కి విశేషమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చిందన్నారు.కావున దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్ర రావు అధ్యక్షతన జరిగే పైడి తేరేష్ బాబు 13 వ స్మారక కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలని అంబేద్కర్ వాదులు,కవులు,కళాకారులు,రచయితలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో దార అంజయ్య, గద్దె త్యాగరాజు, మేడికొండ మురళి, బి.సురేష్, సుకుమార్, ప్రకాష్ ,తదితరులు పాల్గొన్నారు.
