సింగరాయకొండ : ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తిరుమల ఒప్పంద ఉద్యోగుల మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన సింగరాయకొండ జాతీయ రన్‌వే రోడ్డు నందు శనివారం చోటుచేసుకుంది. సింగరాయకొండ మండలం మూలగుంటపాడు జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఆగిఉన్నా లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే తిరుపతి జిల్లా మంగళం గ్రామానికి చెందిన హరిప్రసాద్, విశాలాక్షి, లావణ్య కుమారి, కాన్సిత్, ప్రణశ్రీ తిరుమలలో ఒప్పంద ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం మంగళం నుంచి విజయవాడకు కారులో వెళ్తున్నా క్రమంలో సింగరాయకొండ మండలం మూలగుంటపాడు వద్దకు రాగానే కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరిప్రసాద్ (39) విశాలాక్షి (35) ఘటన స్థలంలోనే మృతి చెందారు. విశాలాక్షి కుమార్తెన లావణ్య కుమారి సహోద్యోగులైన కాన్సిత్, ప్రణశ్రీల ముగ్గురకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్‌కు గుర్తించారు. హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సింగరాయకొండ సీఐ శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రతిపాదన మొదలుకొని ఏదో ఒక చోట రక్తం ఓడుతూ ఉంది గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో సాంకేతిక లోపమో, వాహన చోధకుల నిర్లక్ష్యమో, అతివేగమో ఈ రోడ్డు ప్రమాదంలో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. అయినను రోడ్డు రవాణా శాఖ ప్రమాదాలకు గల కారణాలు, నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇకనైనా ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలను కఠినంగా నిర్వహించాలని స్థానికులు కోరుకుంటున్నారు.

