ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్క కానిస్టేబుల్ విధి నిర్వహణలో ప్రజల భద్రతే మీ లక్ష్యం – ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ -చట్టమే మీ మార్గదర్శి – సత్యం, న్యాయాన్ని నిలబెట్టడం, ప్రజలకు రక్షణ కల్పించడమే మీ లక్ష్యం: ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు – ఘనంగా ముగిసిన పోలీస్ పాసింగ్ అవుట్ పెరేడ్

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలోకి సివిల్ కానిస్టేబుళ్లుగా ఎంపికైన 190 మంది స్టైపెండరీ కానిస్టేబుళ్లకు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో నిరవధికంగా తొమ్మిది నెలల పాటు కఠోర శిక్షణ అనంతరం, ఈరోజు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. అత్యంత వైభవంగా దీక్షాంత్ పరేడ్ నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ముందుగా పరేడ్ కమాండర్‌గా ఉన్న మహమ్మద్ రజా పరేడ్‌కు ఆధిక్యం వహించి సమర్థవంతంగా నిర్వహించారు. వేదికపైకి విచ్చేసిన ముఖ్య అతిథి, అతిథులకు శిక్షణ పొందిన కానిస్టేబుళ్లు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పరేడ్ నిర్వహణకు ముఖ్య అతిథి అనుమతి కోరారు. పరేడ్‌ను వీక్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ముఖ్య అతిథి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ , ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, తో కలిసి పరేడ్‌ను వీక్షించారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్ల యూనిఫామ్, టర్న్‌అవుట్‌ను పరిశీలించారు.

ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గోట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ….. తొమ్మిది నెలల కఠినమైన ప్రాథమిక పోలీస్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రజాసేవలోకి అడుగుపెడుతున్న 190 మంది నూతన పోలీస్ కానిస్టేబుళ్లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 28.11.2022న రాష్ట్రవ్యాప్తంగా 6,100 SCT పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని, సుమారు 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వివిధ దశల ఎంపిక ప్రక్రియ అనంతరం సుమారు 5,800 మంది ఎంపికైనట్లు తెలిపారు. శిక్షణార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నెలవారీ స్టైపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,000కు పెంచడం జరిగిందని పేర్కొన్నారు.

ఒంగోలు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో 22.12.2025న ప్రారంభమైన ఈ బ్యాచ్‌లో మొత్తం 198 మంది శిక్షణార్థులకు శిక్షణ కేటాయించగా, 193 మంది రిపోర్ట్ అయ్యారని, వివిధ ఉద్యోగాలకు ఎంపికైన ముగ్గురిని మినహాయించి ప్రస్తుతం 190 మంది శిక్షణార్థులు పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొంటున్నారని తెలిపారు. వీరంతా పూర్వపు తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారని పేర్కొన్నారు.

ఈ బ్యాచ్‌లో పీజీ 16 మంది, బీటెక్ 34 మంది, డిగ్రీ 121 మంది, ఇంటర్మీడియట్ 19 మంది ఉన్నారని తెలిపారు. ఉన్నత విద్యార్హతలు కలిగిన యువత పోలీస్ శాఖలో చేరడం అభినందనీయమని, విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూనే భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

“పోలీస్ యూనిఫాం అధికారం కోసం కాదు.. బాధ్యత కోసం”. ప్రతి పౌరుడితో గౌరవంగా, బాధితులతో సానుభూతితో వ్యవహరిస్తూ, చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలని సూచించారు.

తొమ్మిది నెలల శిక్షణతో అభ్యాసం పూర్తయిందని భావించకుండా, మారుతున్న నేరాల నేపథ్యంలో సైబర్ క్రైమ్, డిజిటల్ టెక్నాలజీ, ఆధునిక దర్యాప్తు పద్ధతులపై నిరంతరం అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. నిజాయితీని బలంగా, క్రమశిక్షణను అలవాటుగా, చట్టాన్ని మార్గదర్శకంగా, ప్రజాసేవను లక్ష్యంగా చేసుకుని విధులు నిర్వహించాలని నూతన కానిస్టేబుళ్లకు సూచించారు. నిత్యం ధ్యానం చేయడం వలన మనసు ప్రశాంతంగా, నిలకడగా ఉంటుందని, తద్వారా నేరాలను గుర్తించడంలో ఏకాగ్రత పెరగడంతో పాటు, ఆరోగ్యంగా ఉంటే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు.
ఈ స్థాయికి చేరుకోవడంలో తల్లిదండ్రుల త్యాగాలు, ఆశీస్సులు ఎంతో ముఖ్యమైనవని, వాటిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని తెలిపారు. నూతన కానిస్టేబుళ్లు తమ సేవా ప్రయాణంలో అంకితభావంతో పనిచేసి, వారి కుటుంబాలకు, పోలీస్ శాఖకు మరియు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆకాంక్షించారు.

ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి ట్రైనింగ్ అనేది జీవితం లో ముఖ్యమైన బాగమని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగంటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంచి నాయకత్వం కల్గిన జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు గారి అధ్వర్యంలో మంచి నైపుణ్యం కలిగిన కమాండర్లు తో కానిస్టేబుల్స్ ట్రైనింగ్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితి ని బట్టి ప్రతిఒక్క పోలీసు సిబ్బంది కి మెడిటెషన్ ట్రైనింగ్ కూడా చాలా ముఖ్యమన్నారు.
మెడిటెషన్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలని నేను కొరుకుంటున్నన్నారు. ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చినప్పుడే ఎంతటి క్రైం ఇన్వెస్టిగేషన్ అయిన ఇట్టే ఛేదించగలని తేలియచేశారు. మనలో వత్తిడి లేన్నప్పుడే ఎంత పెద్ద సమస్య అయిన ఇట్టే ఛేదించవచ్చన్నారు.

ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఐఏఎస్ మాట్లాడుతూ ట్రైనింగ్ పూర్తి చేసుకుని రియల్ లైఫ్ లో అడుగుపెట్టడం సంతోషంగా ఉందని క్రమశిక్షణతో కూడిన జీవితం గడిపితేనే మీరు చేస్తున్న ఉద్యోగానికి వన్నేతెచ్చి ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు గారు అన్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషను కు వచ్చే పేదల పట్ల, మహిళలు పట్ల, చిన్నారులను గౌరవించే విధంగా ఉండాలన్నారు. రాబోయే కాలంలో ప్రతిఒక్కరూ టెక్నాలజీ తో పోటిపడాలని, టెక్నాలజీని ఉపయోగిస్తేనే అనేక కేసులు ఛేదిస్తామని, యువ కానిస్టేబుల్ టెక్నాలజీ పై ప్రత్యేక దృష్టి పెటాల్సిన అవసరం చాలా ఉందన్నారు.

ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ మాట్లాడుతూ ఒంగోలు డీటీసీలో ప్రస్తుత బ్యాచ్‌కు చెందిన పూర్వపు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 190 మంది SCTPCలకు తొమ్మిది నెలల పాటు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన శిక్షణ అందించినట్లు తెలిపారు. శిక్షణలో భాగంగా చట్టాలు, క్రిమినల్ లాస్, లా అండ్ ఆర్డర్, ఫిజికల్ ఫిట్‌నెస్, పరేడ్ డ్రిల్, ఆయుధాల వినియోగం, ట్రాఫిక్ నియంత్రణ, స్విమ్మింగ్, డ్రైవింగ్‌తో పాటు సైబర్ క్రైమ్, ఫోరెన్సిక్ సైన్స్, డిజిటల్ ఎవిడెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక పోలీసింగ్ అంశాలపై కూడా శిక్షణ అందించినట్లు తెలిపారు.
అదేవిధంగా CCTNS, e-Sakshya, e-Summons, e-Forensic, CDR & IMEI విశ్లేషణ, మొబైల్ పోలీస్ అప్లికేషన్ల వినియోగంపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా శిక్షణార్థులను తీర్చిదిద్దినట్లు తెలిపారు.
శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బెస్ట్ ఇండోర్‌గా ఛెస్ట్ నంబర్ 13 పి. ప్రశాంత్, బెస్ట్ అవుట్‌డోర్‌గా ఛెస్ట్ నంబర్ 45 జి. రవి, బెస్ట్ ఫైరర్‌గా ఛెస్ట్ నంబర్ 162 కె. రామకృష్ణ, బెస్ట్ ఆల్‌రౌండర్‌గా ఛెస్ట్ నంబర్ 13 పి. ప్రశాంత్ నిలిచినట్లు తెలిపారు. వారిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ బ్యాచ్‌లో పీజీ, బీటెక్, డిగ్రీ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ విద్యార్హతలకు అనుగుణంగా జ్ఞానాన్ని, నైపుణ్యాలను మరింత పెంపొందించుకుంటూ, పోలీస్ శాఖలో అంకితభావంతో విధులు నిర్వహించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుత బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే, భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించే దిశగా కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను.

ప్రజల భద్రతే ధ్యేయంగా, ప్రజాసేవే కర్తవ్యంగా భావించి, క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధత, ధైర్యసాహసాలతో విధులు నిర్వహించాలని నూతన కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ గారు సూచించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ, బాధితుల సమస్యలను సానుభూతితో విని, చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.
పోలీస్ శాఖలో చేరడం కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, ప్రజల భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణ అనే గొప్ప బాధ్యతను స్వీకరించడమని ఎస్పీ పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, ప్రజల విశ్వాసాన్ని కూడా కాపాడాలని సూచించారు.
నూతన కానిస్టేబుళ్లు అంకితభావంతో విధులు నిర్వహిస్తూ పోలీస్ శాఖకు, శిక్షణా కేంద్రానికి మరియు వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు.

ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్థన్ మాట్లాడుతూ సమసమాజం కోసం ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ప్రతిఒక్క కానిస్టేబుల్ కృషి చేయాలని ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్థన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎర్పాటు చేసి సమయం నుండి కీలకమైన డిపార్ట్మెంట్ లో ప్రభుత్వం నూతనంగా నోటిఫికేషన్ ఇచ్చి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రజా సేవలో అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. మీరు చేసే సేవ మీ కుటుంబ తోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గౌరవం తీసుకురావాలన్నారు.

సంతనూతలపాడు ఎమ్మెల్యే కె. విజయకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం రావాలని ప్రతి ఒక్కరూ అశపడతారని రావడం మీ అందరూ ట్రైనింగ్ పూర్తి చేసుకుని పోలీసు కానిస్టేబుల్ గా విధి నిర్వహణ లోకి అడుగుపెట్టడం నాకు చాలా సంతోషంగా ఉందని సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్, అన్నారు. ఒక కేసు జరిగినప్పుడు మొదట అక్కడ కు వెళ్ళేది మీరే అని మీరు ఇచ్చే సమాచారం తోనే కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతుందన్నారు. మీరు నీతి నిజాయితీగా పని చేస్తే… కేసు నిలబడుతుందని గుర్తు చేశారు. నీతి నిజాయితీ పని చేసి ఇంకా ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రంలో లా అండ్ అర్డర్ కంట్రోల్ లో ఉంటేనే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి లో మీ అందరూ భాగస్వాములు అవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమం లో ఏఎస్పీ (అడ్మిన్ ) యుగంధర్ బాబు , ఏ ఎస్పీ (ఏఆర్) జీ. నాగేశ్వరరావు గారు, డిఎస్పీ (ఏఆర్) శ్రీనివాసరావు , డిటిసి డిఎస్పీ గురునాధ్ బాబు , ఒంగోలు డిఎస్పీ శ్రీనివాసరావు , ఎస్ బి సీఐ శ్రీనివాసరావు , డిటిసి సీఐ పాండురంగారావు , డిటిసి ఆర్ ఐ ఓ.రవికుమార్, ఆర్ ఐ (అడ్మన్) రమణారెడ్డి , ఆర్ ఐ వెల్ఫేర్ సితారామిరెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *