తాళ్లూరు: మండలంలోని 37 ప్రాధమిక పాఠశాలు, 10 ఉన్నతపాఠశాల, వికే కాలేజిలో మంగళవారం ఎస్ ఎంసీ ఎన్నికలు నిర్వహించంటం జరగుతుందని మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య తెలిపారు. ఈనెల 15న నోటిఫికేషన్ విడుదల కాగా, 18న ఓటర్ల జాబిత ప్రదర్శన, 25న తుది జాబితా ఖరారు జరిగిందని చెప్పారు. ఎస్ఎంసీ ఎన్నిక ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని చెప్పారు. అనంతరం చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక, ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని వివరించారు. ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు తల్లిదండ్రులు విద్యావెత్తలు, రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు సహకరించాలని కోరారు .
నేడు ఎస్ ఎంసీ ఎన్నికలు
28
Sep