బేగంపేట సెప్టెంబర్ 28,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కిమ్స్-సన్‌షైన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో సోమవారం బెగంపేటలోని కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రి ప్రాంగణంలో 2కే వాక్‌థాన్ నిర్వహించారు.“Don’t Miss a Beat” అనే వరల్డ్ హార్ట్ డే 2026 సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ వి గురవారెడ్డి, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎ.భవాని, డాక్టర్ శ్రీధర్ కస్తూరి లతో కలిసి ప్రారంభించారు.
వాక్‌థాన్ అనంతరం కిమ్స్-సన్‌షైన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డా. శ్రీధర్ కస్తూరి ఆధ్వర్యంలో ప్రముఖ కార్డియాక్
నిపుణులతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు విలేఖరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. శ్రీధర్ కస్తూరి మాట్లాడుతూ, గుండె జబ్బులను కేవలం వృద్ధుల సమస్యగా భావించకూడదని, యువతలోనూ అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, ధూమపానం, ఒత్తిడి వంటి కారణాలతో గుండె సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. “గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లక్షణాలు వచ్చిన తర్వాత చికిత్స కోసంఎదురుచూడకుండా, ముందుగానే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా చెమటలు పట్టడం, అసాధారణమైన అలసట, దవడ లేదా చేతికి నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వైద్య సహాయం పొందాలి” అని డా. శ్రీధర్ కస్తూరి తెలిపారు. ప్రస్తుతం గుండె జబ్బుల చికిత్సలో ఆధునిక నిర్ధారణా పద్ధతులు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, అధునాతన ఇమేజింగ్, కాథెటర్ ఆధారిత చికిత్సలు, కార్డియాక్ సర్జరీ వంటి విధానాలు అందుబాటులో ఉన్నాయి. గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో త్వరగా రక్తప్రసరణ పునరుద్ధరించడం అత్యంత కీలకం. అదేవిధంగా హార్ట్ వాల్వ్ సమస్యలలో రోగి వయస్సు, శస్త్రచికిత్స ప్రమాదం, వాల్వ్ నిర్మాణం, ఇతర ఆరోగ్య పరిస్థితులను బట్టి సర్జరీతో పాటు చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. శైలేందర్ సింగ్, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. విజయ్ కుమార్ రెడ్డి ఎస్.చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్ డా. పి.ఎన్. రావు , కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ డా. సందీప్ జనార్దన్ ఏ, కన్సల్టెంట్ కార్డియాక్ అనస్థీషియాలజిస్ట్ డా. సుబ్రహ్మణ్యం , కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కావ్య అన్నపరెడ్డి లు పాల్గొని గుండె జబ్బుల నివారణ, ముందస్తు గుర్తింపు, ఆధునిక చికిత్సా విధానాలు, అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించనున్నారు.
“రోజువారీ నడక, సమతుల ఆహారం, రక్తపోటు–చక్కెర–కొలెస్ట్రాల్ నియంత్రణ, పొగతాగడం మానేయడం, అవసరమైనప్పుడు రెగ్యులర్ హార్ట్ చెకప్ చేయించుకోవడం ద్వారా గుండె ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి” అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.


