గుర్రం జాషువా అవార్డును అందుకున్న ఈశ్వరీ భూషణం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో గుర్రం జాషువా 131 జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి గుర్రం జాషువా అవార్డులను ప్రదానం చేశారు.విజయవాడ కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని పింగళి వెంకయ్య కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సాంస్కృతిక, సృజనాత్మక శాఖ చైర్మన్ పొడపాటి తేజస్విని చేతుల మీదుగా ఈశ్వరీ భూషణం గుర్రం జాషువా అవార్డును అందుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *