దసరా పండుగ సందర్భముగా సోమ, మంగళవారాలలో తాళ్ళూరు మండలంలోని పలు గ్రా మాలలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భముగా బొద్దికూర పాడు గ్రామంలో శ్రీగంగా పార్వతి వర్ధిని సమేత సోమేశ్వరస్వామి దేవాలయ౦, మాధవస్వాముల ఉత్సవిగ్రహాలను అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. సోమవారం రాత్రి తాళ్లూరులోని పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి, రుక్మిణీ సమేత వేణుగోపాలస్వామి ఆలయాల వద్ద దేవీ నవరాత్రుల వేడుకలు ఘనంగానిర్వ హించారు. దశమి సందర్భముగా స్వాములదేవతా మూర్తుల విగ్రహాలనుగ్రామపుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించి పారువేట వద్దకువెళ్లి జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామవీధుల్లోస్వాముల నగర యాత్ర జరిపారు. 10రోజులపాటు దుర్గామా తకు శరన్నవరాత్రులు నిర్వహించి గ్రామాల్లో ఊరేగింపు చేపట్టారు. తాళ్లూరు లో ఏర్పాటు చేసిన దుర్గా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకిరించిన వాహనంలోఏర్పాటు చేసిన దుర్గా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకీరించిన వాహనంలో గ్రామవీధిల్లో భక్తుల సందర్శనార్థం బుధవారం ఊరేగింపు నిర్వహించారు గ్రామా లకు భక్తుల రాకతో దసరా శోభనిచ్చింది.

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి దేవాలయ ప్రాంగణంలో విజయదశమి పండుగ సందర్భంగా మంగళవారం రాత్రి శివపార్వతుల కోలాటం బృందం చిన్నారి బాలబాలికలచే నిర్వహించిన “కోలాటం” భక్తులను ఆకర్షిం చింది .

Save or share this story as a newspaper-style Epaper Clip: