నాగులప్పలపాడు అక్టోబర్ 22 : ఉప్పుగుండూరు 1వ ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గం రాజకీయం రసవత్తరంగా మారింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గద్దె త్యాగరాజు గురువారం నాగులుప్పలపాడు మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ వేసారు . ఆ గ్రామంలో 1995 ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రమే గెలుస్తూ వస్తున్నారు. ఆ సెగ్మెంట్లో మొత్తం ఓట్లు 3400 కాగా 1550 ఓట్లు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు, 650 ఓట్లకు పైగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు ,బీసీ లోని అన్ని సామాజిక వర్గాలు కలిపి 600 ఓట్లు కలిగి ఉన్నారు. మిగిలిన ఓట్లు జనరల్ కేటగిరికి చెందినవారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎంపీటీసీ సెగ్మెంట్ ను ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ ఎస్సీ రిజర్వ్ అభ్యర్థులకు కేటాయించింది. అదేవిధంగా అధికార తెలుగుదేశం కూటమీ పార్టీలు కూడా షెడ్యూల్డ్ రిజర్వు అభ్యర్థులకు కేటాయించాలని ఆ పార్టీలో ఉన్న వారు కోరుకుంటున్నారు. ఈరోజు జరిగిన నామినేషన్ల కార్యక్రమంలో ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ జర్నలిస్ట్ గద్దె త్యాగరాజు తెలుగుదేశం పార్టీ తరపున నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. దీంతోపాటుగా అదే పార్టీలో మరో ఇద్దరు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా మరో ఇద్దరు నామినేషన్ వేసినట్లు సమాచారం. ఏదైనాప్పటికీ ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి గెలవని ఎంపీటీసీ సెగ్మెంట్ ను ఏ విధంగానైనా గెలిపించుకోవాలని వ్యూహంతో స్థానిక శాసనసభ్యులు బి ఎన్ విజయ్ కుమార్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. దీని కొరకు మండలంలో అభ్యర్థులు ఎంపిక కొరకు త్రిమెన్ కమిటీని కూడా నిర్ణయించారు. ఆశావాహులందరూ కూడా ఎమ్మెల్యేని కలిసి వారి వారి బల బలాలను ఆయనకు వివరించారు. మండలంలో మొత్తం ఉప్పుగుండూరు 1వ సెగ్మెంట్ పైనే ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. పార్టీల పేరుతో నామినేషన్లు వేస్తున్నప్పటికీ స్థానిక శాసనసభ్యులు బి.ఎన్ విజయ్ కుమార్ ఎవరికి బి ఫారం ఇస్తారో వేసి చూడాల్సి ఉంది .


Save or share this story as a newspaper-style Epaper Clip: