కంటి చూపు అనేది మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం…..మాజీ మంత్రివర్యులు, ఎన్డిఎంఏ మాజీ ఉపాధ్యక్షులు బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు… మర్రి శశిధర్ రెడ్డి.

బేగంపేట అక్టోబర్ 25, ( జె ఎస్ డి ఎం న్యూస్ ) :
కంటి చూపు అనేది మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని మాజీ మంత్రి, ఎన్డిఎంఏ మాజీ ఉపాధ్యక్షులు బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. పేదలు మధ్యతరగతి వారు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మర్రి సూచించారు.రామ్ గోపాల్ పేట్ డివిజన్ పరిధిలోని సోమ సుందరం స్ట్రీట్ కొత్త ఎల్లయ్య హైస్కూల్లో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని మర్రి శశిధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
స్వామి వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్, యోగ క్షేమం వహామ్యహం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వజనాల దయానందరావు అధ్యక్షతన సాధురాం ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్ష మరియు క్యాటరాక్ట్ ఆపరేషన్ శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ……కంటి చూపు అనేది మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరమని , ఈ రోజుల్లో చాలా మందికి , ముఖ్యంగా పేదలు , వృద్ధులకు కంటి సమస్యలు వచ్చినా ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి లేదని, అలాంటి వారి కోసం ఇలాంటి ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేయడం నిజంగా గొప్ప సేవా కార్యక్రమమని కొనియాడారు.
భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ సేవా హి సంఘటన్ అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో పేదలకు అండగా నిలబడటం, ఆరోగ్య సేవలు అందించడం మన బాధ్యత అని, ఈ శిబిరం ద్వారా వందల మందికి చూపు వెలుగు అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ వైద్య శిబిరంలో సుమారు 485 మందికి పైగా పేద, మధ్య తరగతి ప్రజలు కంటి పరీక్షలు చేయించుకున్నారు. వారికి బిపి, షుగర్ పరీక్షలతో పాటు ఉచితంగామందులు, ఐ డ్రాప్స్, కంటి అద్దాలు మరియు టాబ్లెట్లు పంపిణీ చేశారు. అందులో 50 మందికి పైగా కంటి శుక్లాల (క్యాటరాక్ట్) సమస్య ఉన్నవారికి సాధురాం ఐ హాస్పిటల్ లో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించారు. శిబిరానికి హాజరైన ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సాధురాం ఐ హాస్పిటల్ చైర్మన్ హరీష్ సహాని , వారణాసి కృష్ణమూర్తి , కొత్త శాంతన్ కుమార్, వజనాల దయానందరావు , చేపూరి చంద్రప్రకాష్ గుప్తా, సందీప్ వర్మ, ఆకుల విజయ్, పట్టం కిరణ్, గణేష్ గుప్తా మరియుబస్తీవాసులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *