హైదరాబాద్ అక్టోబర్ 25 (జె ఎస్ డి ఎం న్యూస్) :
యువత మత్తుకు దూరంగా ఉండాలనీ, యువత మత్తు పదార్ధాల వాడకానికి దూరంగా ఉండేట్లు, వారు పెడదోవ పట్టకుండా స్వచ్ఛంద సంస్థలు జోక్యం చేసుకుని,మత్తు పదార్థాల వాడకంపై వారికి అవగాహన కల్పించాలని,తమిళనాడు ఎంపీ డాక్టర్ తిరుమావళవన్ సూచించారు.
తమిళనాడు ఎంపీ డాక్టర్ తిరుమావళవన్‌ను హైదరాబాద్ లో వేకప్ హ్యుమానిటీ ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత భవిత దేశానికి ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. యువ శక్తి దేశానికి ఎంతో ముఖ్యమన్నారు. అయితే నేడు దేశంలో యువత ఎక్కువగా మత్తుకు బానిసలవుతున్నారని, వారి భవిష్యత్తును కోల్పోతున్నారని అన్నారు. వారు మత్తుకు దూరంగా ఉండేలా స్వచ్ఛంద సంస్థలు జోక్యం చేసుకొని మత్తు పదార్థాల వాడకం, దానివల్ల వచ్చే అనర్ధాలను యువతకు వివరించే కార్యక్రమాలను విరివిగా చేపట్టాలని ఆయన సూచించారు.తమిళనాడుకు చెందిన విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మూడోసారి పార్లమెంట్సభ్యుడిగా ఎన్నికైన డాక్టర్ తోల్. తిరుమావళవన్ ను హైదరాబాద్‌లో వేకప్ హ్యుమానిటీఆర్గనైజేషన్ ప్రతినిధి బృందం కలిసింది.ఈ సమావేశంలో
సంస్థ అధ్యక్షుడు, ఇండో-కెనడియన్ న్యాయవాది సయ్యద్ నూర్ఉపాధ్యక్షుడు న్యాయవాది మొహమ్మద్ ముదస్సిర్ జుహా, సభ్యులు జి. లలిత్ కుమార్ అడ్వకేట్, వంశీ అడ్వకేట్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నషా ముక్త్ భారత్ మాదకద్రవ్య రహిత భారతదేశం, మత్తు నుంచి యువతకు విముక్తి ఎలా కల్పించాలి అన్న కార్యక్రమంపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా యువతను మాదకద్రవ్యాల బారి నుంచి రక్షించడం, ప్రజల్లో అవగాహన పెంపొందించడం, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి సమష్టిగా కృషి చేయాల్సిన అవసరాన్ని వివరించారు.ఈ సమావేశంలో వెల్గో టెలికమ్యూనికేషన్స్‌కు చెందిన శ్రీధర్ తదితరులు ఉన్నారు.




Save or share this story as a newspaper-style Epaper Clip: