ఒంగోలు నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న వ్యభిచార కార్యకలాపాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు.
ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్నూలు రోడ్డులో ఉన్న అజంతా లాడ్జిపై టాస్క్ ఫోర్స్ ఇన్‌చార్జ్ సీఐ కమలాకర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ చెంచయ్య మరియు సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో అజంతా లాడ్జిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులు, లాడ్జి యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
అసాంఘిక, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: