బేగంపేట అక్టోబర్ 26,(జే ఎస్ డి ఎం న్యూస్ )
గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమం విషయంలో ఎన్నికల కమిషన్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని మాజీమంత్రి, బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. అనంతరం మీడియా తో మాట్లాడారు. నవంబర్ 6 వ తేదీన గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమం ముగుస్తుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. కాలనీలు, బస్తీలు, అపార్ట్ మెంట్ లలో పాదయాత్ర గా తిరుగుతూ ఇంటింటికీ వెళ్ళి అర్హులైన గ్రాడ్యుయేట్ లను గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. ఓటరు నమోదు కార్యక్రమం బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉన్నప్పటికీ పట్టించుకోని కారణంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. BLO లను కూడా నియమించలేదని మండిపడ్డారు. గత గ్రాడ్యుయేట్ ఎన్నికలలో హైదరాబాద్ నగర పరిధిలో ఒక లక్ష 10 వేల మంది గ్రాడ్యుయేట్ లు ఓటర్లుగా నమోదు కాగా, ప్రస్తుతం ఇప్పటి వరకు 23 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గ్రాడ్యుయేట్ ల నుండి ఓటరు నమోదు పత్రాలు స్వీకరించి అధికారులకు అందజేస్తే అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం కూడా ఏ మాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అసమర్ధ పాలన వలన ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పాలనను గాలికొదిలి రాష్ట్రాల పర్యటన లు చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో ఓటరు నమోదు కార్యక్రమం నియోజకవర్గ ఇంచార్జి గోసుల శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, టి. మహేశ్వరి, అత్తిలి అరుణ గౌడ్, కుర్మ హేమలత, డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, గుర్రం పవన్ కుమార్ గౌడ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, వెంకటేషన్ రాజు, శ్రీనివాస్ గౌడ్, నాయకులు గందే నాగులు, టి. శ్రీహరి, ప్రవీణ్ రెడ్డి, నరేందర్, లక్ష్మీపతి, ఏసూరి మహేష్, కరుణాకర్ రెడ్డి, కొండాపురం మహేష్ యాదవ్, అశోక్ యాదవ్, మల్లారెడ్డి, ప్రేమ్, అబ్బాస్, గుడిగే శ్రీనివాస్ యాదవ్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.





Save or share this story as a newspaper-style Epaper Clip: