ఎట్టకేలకు తాళ్లూరు మండల ప్రజా పరిషత్ మొదటి సారిగా 40 సంవత్సరాల తర్వాత టిడిపి కైవసం చేసుకున్నది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మొత్తం 14 ప్రదేశికాలకు గాను 14 మంది టిడిపి బలపరచిన అభ్యర్థులు మాత్రమే మిగలటంతో వారికి ఆ౦ దేవనహాయం, ఎఆర్డీఓలు ఎంపీడీఓ అజిత, తహసీల్దార్ రమణా రావులు డిక్లరేషన్ ఫారాలు అందించారు.డిక్లరేషన్ ఫారాలు అందుకున్న ఎంపీటీసీలు దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్లను కలిసి కృతజ్ఞతలు తెలిపారు . నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు అభినందనలు తెలిపారు . నూతనంగా ఎన్నికైన పాలక వర్గాన్ని ఎంపీటీసీ లు శివరామపురం బొమ్మిరెడ్డి రమణమ్మ, దోనకాయల పాడు ఎంపీటీసీగా కృష్ణం నాగేశ్వర రావు, బొద్దికూరపాడు దేవండ్ల లక్ష్మి, తూర్పుగంగవరం -1 యాడిక శ్రీకాంత్ రెడ్డి, తూర్పుగంగవరం 2 బొల్లా నరేంద్ర పెద బాబు, లక్కవరం వల్లెపు వెంకట సుబ్బా రావు, మాధవరం పాలెపోగు రవి, మల్కాపురం అనపర్తి సంతోషం, మన్నేపల్లి గోళ్ల పాటి మేషేక్, నాగంబొట్ల పాలెం వేడికోల చంద్రమ్మ, తాళ్లూరు – 1 కోట వెంకట లక్ష్మి, తాళ్లూరు-2 కాడ్రేడ్డి విజయ, తురక పాలెం అన్నపు రెడ్డి రమణ, వెలుగు వారి పాలెం అలూరి అక్కమ్మల ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమం లో మండల టిడిపి అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర నాటక రంగ అకాడమీ డైరెక్టర్ బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, టిడిపి నాయకులు మానం రమేష్ బాబు, నవులూరి విద్యాసాగర్, క్టన్లర్ ఇన్చార్జి లు రాచకొండ వెంకట రావు, కైపు నాగార్జున రెడ్డి, నారిపెద్ది కళ్యాణ్ చందన, గొల్లపూడి వేణుబాబు, పి రమణా రెడ్డి , మండలం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: