కురిచేడు: జాతీయ ఐక్య దినోత్సవాన్ని పురస్క రించుకొని స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో భారత మొదటి ఉప ప్రధాన మంత్రి, హోమ్ శాఖామంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు . కార్యక్రమానికి గురు కులం ఇన్చార్జి ప్రిన్సిపాల్ విజయకుమార్ అధ్యక్షత వహించి ముందుగా పటేల్ చిత్రపటా నికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్య అతిథిగా మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సెంట్రల్ కన్వీ నర్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి కపురం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ఎనలేని సేవచేసి భారతరత్న అవార్డు సొంతం చేసుకుని, భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా భార తదేశం మొత్తాన్ని ఒకేతాటి మీద నడిపించిన స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ వల్లభా య్ పటేల్ ఎప్పటికీ చిరస్మరణీయులని కొని యాడారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: