నల్లగుట్ట బస్తీ ప్రజల డ్రైనేజీ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలుతీసుకోవాలి……వాటర్ బోర్డ్ ఎండీ అశోక్ రెడ్డీ ని కోరిన మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన.

హైదరాబాద్ నవంబర్ 3,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట బస్తీ ప్రజల డ్రైనేజీ సమస్య పరిష్కారానికి తక్షణ
చర్యలుతీసుకోవాలని వాటర్ బోర్డ్ ఎండీ అశోక్ రెడ్డీ ని సనత్ నగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన కోరారు.రామ్‌గోపాల్ పేట్, పి.జి. రోడ్ నుండి నల్లగుట్టకు వెళ్లే మార్గంలో (మార్వాడి విద్యాలయం ఎదురుగా, వెస్లీ స్కూల్ కాంపౌండ్ గేట్ ఆనుకుని ఉన్న) బస్తీ ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన మంగళవారం వాటర్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) అశోక్ ని అధికారికంగా కలిశారు.ఈ సందర్భంగా బస్తీ ప్రజలుఎదుర్కొంటున్న తీవ్రమైన డ్రైనేజీ సమస్య, దానివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న విషయాన్ని ఎండీ అశోక్ రెడ్డి కి ప్రసూన సవివరంగా వివరించారు.
స్పందించిన అశోక్ రెడ్డి ఈ సమస్య పై తక్షణ చర్యలు తీసుకుంటామని,అధికారులను అప్రమత్తం చేస్తామన్నారు.
బస్తీ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ సమస్య పరిష్కారానికి తక్షణమే స్పందించిన వాటర్ బోర్డ్ ఎండీ కి కాట్రగడ్డ ప్రసూన కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు మాణిక్యం బండారి రాజు తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *