తాళ్లూరు: బొద్దికూరపాడు మాజీ సర్పంచి పోలం రెడ్డి రత్తమ్మ (62) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూసారు. ఆమె 2000 నుండి 2005 వరకు బొద్దికూరపాడు సర్పంచిగా పనిచేసారు. ఆమె భర్త సూరా రెడ్డి సీనియర్ టిడిపి నాయకుడుగా ఉన్నారు. దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు
ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు. ఆమె మృత దేహాన్ని డాక్టర్ కడియాల లలిత్ సాగర్ సందర్శించి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామాభి వృద్దికి ఆమె పాత్ర మరవలేదని అన్నారు. నివాళులు అర్పించిన వారిలో మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర నాటక రంగా అకాడమి డైరెక్టర్, ఎంపీపీ అభ్యర్థి బి . ఆర్ ఓబులు రెడ్డి. పిన్నిక రమేష్ , తెలుగు రైతు అధ్యక్షుడు కైపు రామ కోటి రెడ్డి, పోలం రెడ్ది రమణా రెడ్డి, గుజ్జుల అంకి రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: