మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి

తాళ్లూరు: మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పొదిలి రేంజ్ సెక్షన్ ఆఫీసర్ డి సంక్రు నాయక్ అన్నారు. పొదిలి రేంజ్, దొనకొండ సెక్షన్ పరధిలోని అటవీశాఖ సామాజిక అటవీ నర్సరీల ద్వారా అందించిన మొక్కలను, దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో దారం వారి పాలెం ఎస్సీ కాలనీలో పంపిణీ చేసారు. ఈ నందర్భంగా నండ్రు నాయక్ మాట్లాడుతూ మొక్కల పెంపకం వలన భవిష్యత్ తరాలకు స్వచ్చమైన గాలి, ఆరోగ్య కరమైన వాతావరణం అందించవచ్చని చెప్పారు. డిబిఆరీసీ జిల్లా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వర రావు మాట్లాడుతూ అటవీశాఖ అందిస్తున్న మొక్కలను ప్రజలు నద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక్క కుటుంబం– ఒక్క మొక్క ప్రతి మొక్కకు సంరక్షణ అనే సందేశం ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *