తాళ్లూరు: రబీ పైర్లు సాగు చేసే రైతుల కోసం రైతు సేవా కేంద్రాలలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని వినియోగించుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. యూరియా – 32, డీఏపీ – 22.5 టన్నులు అందుబాటులో ఉన్నాయని పైరును బట్టి, దశను బట్టి, విస్తీర్నంను బట్టి రైతు దామాషా ప్రకారం ఎరువులు పొందవచ్చని చెప్పారు. ఎరువుల వినియోగం తగ్గించాలని విచక్షణా రహితంగా రసాయన ఎరువులు విరివిగా వాడవద్దని చెప్పారు. ప్రకృతి సాగు వైపు రైతులు మొగ్గు చూపాలని కోరారు. విఏఏ సాయి తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: