తాళ్లూరు : మండలంలోని గుంటిగంగ సన్నిధిలోని గుంటిగంగ బ్రాహ్మణ సత్రంలో కార్తీక మానం సందర్భముగా ఆదివారం సామూహిక సత్యన్నారాయణస్వామి వ్రత కార్యక్ర మం ఘనంగా జరిగింది. బ్రాహ్మణ సత్రం అధ్యక్షురాలు యల్లాప్రగడ లక్ష్మీ సుందరి, మండల బ్రాహ్మణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. బ్రాహ్మణ దంపతులుసామూహిక సత్యన్నారాయణ వత్రం చేపట్టారు. ఆరేళ్లుగా కార్తికమాసం సందర్భంగా వేదపండితుల సారద్వర్యంలో సత్యన్నారాయణస్వామి వ్రతాలు నిర్వ హిస్తున్నారు. ముందుగా గోపూజ, సామూహిక మహాన్యాన పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. సామూహిక సత్యన్నారాయణ వత్రంకు బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతాన్ని తిలకించి స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నత్రం అభివృద్ధికి దాతల సహకారం ఎంతో వున్నదని, బ్రాహ్మాణనంత్రంలో భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని అధ్యక్షురాలు లక్ష్మీసుందరి తెలిపారు. బ్రాహ్మణులు సామూహిక వనభోజన కార్యక్రమం చేపట్టారు. నత్రం కమిటీ ఆధ్వర్యంలో నత్రం అభివృద్ధికి కృషి చేస్తున్న పెద్దలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సత్రం కమిటీ అధ్యక్షురాలు యల్లాప్రగడ లక్ష్మీ సుందరి, నత్రం కమిటీబాధ్యులు వై. కన్నయ్య, ఆర్ వై కోటేశ్వరరావు, డీవీఎం రంగారావు, దీక్షితులు, వెంకటేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. అన్నివర్గాల ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: