సంతనూతలపాడు సేవా సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహణ – 320 మందికి ఉచిత వైద్య సేవలు

ఒంగోలు : సంతనూతలపాడు సేవా సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక గాంధీ పార్క్ ఎదురుగా ఉన్న మాంటిసోరి హై స్కూల్ నందు ఈ ఆదివారం ఉచిత మెగా మెడికల్ క్యాంపు ను నిర్వహించినారు. ఈ కార్యక్రమం ను ఒంగోలు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ తిరుపతి కిషోర్ బాబు, ఏపీపీఎస్సీ రాష్ట్ర కన్వీనర్ పి ప్రకాష్ బాబు మరియు 35వ డివిజన్ కార్పొరేటర్ అంకసాల రంగనాయకులు ప్రారంభించారు. ఈ క్యాంపు నందు ఒంగోలు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ స్వర సూపర్ స్పెషాలిటీ హార్ట్ హాస్పిటల్, ఒంగోలు హెచ్ జి సి ఎం ఎన్ ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ మరియు వారిపై ఆధారపడిన కుటుంబాలకు చెందిన 320 మంది కి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేసినారు. ఈ క్యాంప్ నందు బీపీ షుగర్, ఎముకల పట్టుత్వ పరీక్ష పాదాల నరాల స్పర్శ పరీక్ష ఊపిరితిత్తుల పరీక్ష గుండె ఈసీజీ గుండె 2డి ఎకో పరీక్ష క్యాన్సర్ నిర్ధారణ ప్రాథమిక పరీక్షలు అయిన పి ఎస్ ఏ, థర్మల్ స్కానింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులను పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో సేవా సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శనగల వెంకటరమణ, ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సాంబశివ రావు, సెక్రటరీ కిరణ్, నగర అధ్యక్షులు నూరుద్దీన్, రోహిత్, శంకర్, రమేష్, మాలకొండయ్య, శ్రీనివాసులు, శివ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *