తాళ్లూరు: రబీలో అల్పపీడన ప్రభావంతో పడుతున్న వర్షాలకు స్పల్ప కాలిక రకాలను విత్తుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. మండలంలోని దారం వారి పాలెం, మన్నేపల్లిలో బుధవవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. మండలంలో 32.6 మి.మీల మేర వర్షపాతం నమోదు అయినట్లు చెప్పారు. మినుము, పెసర, ఉలవలు, అలచందలు, సోయా చిక్కుడు, శనగ విత్తుకోవాలని ఆయా రకాల పంట కాల వ్యవధులను వివరించారు. రబీ పంటల భీమా చేసుకోవాలన ఆయా పంటలకు భీమా నగదు వివరాలను చెప్పారు. విఏఏ రామామృత, విఏ హెచ్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: