తాళ్లూరు: మండలంలో ఏకగ్రీవంగా ఎంపికయిన ఆరు పంచాయితీలలో స ర్పంచిలను, వార్డుసభ్యులను, అనంతరం ఏన్నుకున్న ఉప స ర్పంచిల ప్రమాణ స్వీకారాన్ని ఆయా ఆర్ ఓ లు చేయించారు. తాళ్లూరు స ర్పంచిగా ఇడమకంటి నుబ్బా రెడ్డి, ఉప సర్పంచిగా చెరుకుపల్లి నాగాంజనేయులు, వెలుగువారి పాలెం సర్పంచిగా చిన్నపురెడ్డి నాగమణి, బొద్దికూరపాడు సర్పంచిగా చీమలదిన్నే త్రివేణి, ఉప సర్పంచిగా పోలంరెడ్డి రమణా రెడ్డి, తురకపాలెం స ర్పంచిగా కుమ్మిత రమణ, ఉప సర్పంచిగా కుమ్మిత సుబ్బా రెడ్డి, తూర్పుగంగవరం సర్పంచిగా అనుమల వెంకటేశ్వర్లు, ఉప నర్పంచిగా చీమలదిన్నే శ్రావణి, రామభద్రాపురం నర్పంచిగా బిబి జాన్, ఉప నర్పంచిగా యాతం కొండమ్మలను ఆయా గ్రామాల వార్డు మెంబర్లను ప్రమాణ స్వీకారం చేయించారు. వెలగు వారి పాలెం ఉప సర్పంచి ఎన్నిక మాత్రం వాయిదా పడింది. మండలంలో మొత్తం 16పంచాయితీలలో ఆరు ఏకగ్రీవం కాగా మరో పది పంచాయితీలకు నర్పంచి పదవి కోసం 33 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 168 వార్డులలో 84 వార్డులు ఎకగ్రీవం కాగా మరో 84 వార్డులలో వార్డు సభ్యుల కోసం 181 మంది పోటీలో ఉ న్నారు.







Save or share this story as a newspaper-style Epaper Clip: