ఒంగోలు : ప్రకాశం జిల్లాలో అల్పపీడన ద్రోణితో బుధవారం ఉదయం నాటికి 500 మి.మీలు జిల్లా నరానరి 17.9 మి.మీల వర్షపాతం నమోదు అయినట్లు జిల్లా వ్యవసాయాధికారి (జెడీఏ) శ్రీనివాస రావు తెలిపారు. జిల్లాలోని 27 మండలాలకు గాను 26 మండలాలలో వర్షపాతం నమోదు అయినట్లు చెప్పారు. అందులో కొత్త పట్నం 49.8 మి.మీ, వలేటి వారి పాలెం 44.0, జె పంగులూరు 35.0, శింగరాయ కొండ 34.2, తాళ్లూరు 33.6. ఒంగోలు రూరల్, అర్బన్‌లలో 30.8, ఉలవ పాడు 26.8, అద్దంకి 23.4, ముండ్లమూరు 21.4, మర్రిపూడి 21.0, గిద్దలూరు 19.8, లింగ సముద్రం 17.0, కొండేపి 14.6, కందుకూరు 14.0, జరుగుమల్లి 13.6, సంతనూతల పాడు 13.4, టంగుటూరు 10.2, చీమకుర్తి 8.6, దర్శి 7.2, …నాగులుప్పల పాడు 6.8 మి.మీలు, మద్దిపాడు 6.4, కురిచేడు 5.8, బల్లికురువ 4.2, పొన్నలూరు 3.6, సంతమాగులూరు 2.8, దొనకొండ 1.2 మి.మీల మేర వర్షపాతం నమోదు అయినది. బుధవారం మధ్యాహ్నం కూడ పలు చోట్ల వర్షాలు కురుస్తుండటంతో రబీలో పలు పంటలు సాగు చేస్తున్న రైతన్నల ఆశలు చిగురిస్తున్నాయి.
Save or share this story as a newspaper-style Epaper Clip: