ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామానికి చెందిన మైనర్ బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎల్ సంపత్ కుమార్ సోమవారం తెలిపారు. పసుపుగల్లు గ్రామానికి చెందిన మైనర్ బాలిక దర్శి లోని కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రతిరోజు ఇంటికి వస్తూ పోతూ ఉంటుంది. ఆదివారం సెలవు కావడంతో ముళ్ళమూరులోని కస్తూర్బా పాఠశాల వద్దకు వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లిందని చీకటి పడిన ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బంధువులు కుటుంబ సభ్యులు ఇళ్ల వద్దకు వెళ్లి విచారించిన కనిపించక పోవడం లేదని నిర్ధారణకు వచ్చిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎలిశమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి న్నట్లు ఎస్ ఐ ఎల్ సంపత్ కుమార్ తెలిపారు.
బాలిక అదృశ్యంపై కేసు నమోదు
13
Feb