ముండ్లమూరు( ప్రభుత్వం 104 వాహనం ద్వారా గ్రామాలలో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ వద్ద ఏర్పాటు చేస్తున్న ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని వైద్యాధికారి బి మధు శంకర్ అన్నారు .మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల పోలవరం గ్రామంలో సోమవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరాల ద్వారా మంచి మంచి మందులు టెస్టులు నిర్వహించి మందులు అందిస్తున్నామన్నారు. అనుభవజ్ఞులైన డాక్టర్లచే వైద్య సేవలు అందించడం జరుగుతుంది అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈ శిబిరాలకు వచ్చి వైద్య సేవలు పొందాలన్నారు. ఈ శిబిరంలో 140 మందికి వైద్య పరీక్ష నిర్వహించగా అందులో 40 బీపి 45 షుగర్ 15 బాలింతలు 15 గర్భవతులు 25మంది జలుబులు దగ్గులు ఉన్నవారిని గుర్తించి మందులు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని. సి హెచ్ ఓ శరణ్య. ఏఎన్ఎం సుమతి.104 డిఇఓ వెంకట ప్రసాద్. శ్రీలత .రజిని. రూత్ మేరీ తదితరులు పాల్గొన్నారు.
ఫ్యామిలీ ఫిజీషియన్ సేవ లు వినియోగించుకోవాలి
13
Feb