కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వైద్య పరీక్షలు

ముండ్లమూరు( మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని. వి జ్యోతి. ఎం జాస్మిన్ మాట్లాడుతూ విద్యార్థినిలు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకుండా ఉండాలన్నారు. విద్యార్థులు పరిశుభ్రంగా ఉండేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో భోజనం చేసే ముందు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు. ఉదయం మంచు సమయంలో బయట తిరగరాదని తెలియజేశారు. ఎవరికైనా జలుబులు దగ్గు జ్వరం ఉన్నట్లయితే వెంటనే దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ శిబిరంలో 50 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఒక పాపకు రే చీకటిగా ఉందని గుర్తించి ఒంగోలు రిమ్స్ కు తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ ఎస్ సునీత. ఏఎన్ఎం ప్రభావతి. ఆశాలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *